Share News

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే శాశ్వతం.. కొత్త ప్లాన్‌తో రూ.400 కోట్లు ఆదా

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:04 AM

కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌ వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది.

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే శాశ్వతం.. కొత్త ప్లాన్‌తో రూ.400 కోట్లు ఆదా
KBR Park

హైదరాబాద్, అక్టోబర్ 5: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌ వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేయనుంది. కొత్త ప్లానింగ్ మార్పులతో జీహెచ్ఎంసీకి రూ.400 కోట్లు ఆదా అవనుంది. అవసరాన్ని బట్టి ఫ్లై ఓవర్లు, అండర్పాస్‌లు నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మీడియాకు వెల్లడించారు.


కేబీఆర్ పార్క్ చుట్టూ సింగల్ వే, ఫ్రీ లెఫ్ట్ విధానం మంచి ఫలితాలను ఇచ్చాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు. అందుకే సింగల్ వే విధానాన్ని శాశ్వతంగా ఉంచబోతున్నామని ప్రకటించారు. ప్లానింగ్‌లో మార్పులు చేసి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు ఒకే ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. నాగార్జున సర్కిల్ నుంచి చెక్‌పోస్ట్ వరకు స్టీల్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నామని.. ఏడాదిలో పూర్తి అయిపోతుందని తెలిపారు. కొత్త ప్లాన్ వలన ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పారు. బ్రిడ్జ్ పనులు, అండర్పాస్ పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయన్నారు. కొన్ని కోర్టు కేసులు వల్ల ప్లాన్ కూడా మార్చామన్నారు. ట్రాఫిక్‌ను శాశ్వతంగా తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 11:18 AM