Share News

సిద్ధిక్ నగర్‌లో భవనం పైనుంచి పడి అస్సాం యువకుడి మృతి

ABN , Publish Date - Oct 05 , 2026 | 09:33 AM

హైదరాబాద్ సిద్ధిక్ నగర్‌లో భవనం పైనుంచి పడి అస్సాం యువకుడు దిల్వార్ హుస్సేన్ మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తులో మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

సిద్ధిక్ నగర్‌లో భవనం పైనుంచి పడి అస్సాం యువకుడి మృతి

హైదరాబాద్, అక్టోబర్ 05: నగరంలోని సిద్ధిక్ నగర్‌లో భవనం పైనుంచి పడి అస్సాం యువకుడు దిల్వార్ హుస్సేన్ మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మద్యం మత్తులో మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు వెంటనే స్పందించి.. అతడిని కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.


ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దిల్వార్ హుస్సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

Updated Date - Oct 05 , 2026 | 09:58 AM