Share News

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కవిత ఆందోళన

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:46 AM

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రక్షణ సేన ఆందోళనకు దిగింది. ఈరోజు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో.. నగరంలోని సింగరేణి భవన్‌‌ ముట్టడికి యత్నించారు.

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కవిత ఆందోళన
Kalvakuntla Kavitha

హైదరాబాద్, అక్టోబర్ 5: సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రక్షణ సేన ఆందోళనకు దిగింది. ఈరోజు(సోమవారం) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో.. నగరంలోని సింగరేణి భవన్‌‌ ముట్టడికి యత్నించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 35% వాటా చెల్లించాలని, మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ ఫిట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని, మారుపేర్లు (అలియాస్ నేమ్స్) కార్మికుల సమస్య పరిష్కరించాలని పట్టుబట్టారు.


మరిన్ని డిమాండ్లు..

* జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలి

* విజిలెన్స్ పేరుతో ఆపిన డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలి

* ప్రతి కార్మికుడికి సొంత ఇంటి పథకం కోసం 2 గుంటల భూమి ఇవ్వాలి

* సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలి

* సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలి

* కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ సిఫార్సుల మేరకు జీతాలు ఇవ్వాలి

* ప్రభుత్వం సింగరేణికి బాకీ పడిన రూ.62 వేల కోట్లు వెంటనే చెల్లించాలి


ఇవి కూడా చదవండి...

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే శాశ్వతం.. కొత్త ప్లాన్‌తో రూ.400 కోట్లు ఆదా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 12:03 PM