శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
ABN , Publish Date - Oct 05 , 2026 | 10:43 AM
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని డీఆర్ఐ అధికారులకు అప్పగించారు.
హైదరాబాద్, అక్టోబర్ 05: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని డీఆర్ఐ అధికారులకు అప్పగించారు. ఆ ప్రయాణికుడిని వారు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అతడి వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 800 గ్రాముల బంగారాన్ని అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దీని విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిద్ధిక్ నగర్‌లో భవనం పైనుంచి పడి అస్సాం యువకుడి మృతి
పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు