Share News

వివేకా హత్య కేసులో జగన్ మౌనం నేరాంగీకారమే: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ABN , Publish Date - Oct 05 , 2026 | 02:48 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ది వైసీపీ కాదని.. గొడ్డలి పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.

వివేకా హత్య కేసులో జగన్ మౌనం నేరాంగీకారమే: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Mandipalli Ramprasad Reddy

అమరావతి, అక్టోబర్ 5: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ది వైసీపీ కాదని.. గొడ్డలి పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి బాబాయి హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారని.. వివేకా హత్యలో అంతిమంగా లబ్ధిదారుడు జగనేనని ఆధారాలు వెల్లడించాయన్నారు. వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మౌనం నేరాంగీకారమే అని అన్నారు. ఈ కేసులో నిజాలు బయటపడితే జగన్ రాజకీయ భవిష్యత్తు కటకటాలే అంటూ సంచలన కామెంట్స్ చేశారు.


పేదవాడి సొంతింటి కలను చిదిమేసింది గత జగన్ రెడ్డి ప్రభుత్వమే అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో యుద్ధప్రాతిపదికన పేదల సొంతింటి నిర్మాణం జరుగుతోందన్నారు. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అమరజీవి జలధార ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందిస్తామని చెప్పారు. పల్లె పండుగ 3.0తో రూ.11 వేల కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.


రాయలసీమకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో హంద్రీ-నీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని మండిపల్లి అన్నారు. హంద్రీ-నీవాను అభివృద్ధి చేసి, కుప్పానికి నీళ్లు అందించిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. హార్టీకల్చర్ హబ్‌గా రాయలసీమను తీర్చిదిద్దుతూ ‘రాయలసీమ రైజింగ్’కు బాటలు వేస్తున్నామన్నారు. గతంలో టీడీపీ నాయకులను బెదిరించి, దాడులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నవారే నేడు పారదర్శకత గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఏకగ్రీవాలు మా విధానం కాదు.. పారదర్శక ఎన్నికలే మా విధానం’ అని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

కడప అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. గొడ్డలి పార్టీ అధినేతకు సీఎం చంద్రబాబు సవాల్

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 02:49 PM