Share News

గోల్డ్ షాప్‌లో భారీ చోరీ.. రూ.2 కోట్ల వజ్రాల అపహరణ

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:01 PM

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఓ బంగారం షాప్‌లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి షాపు షెట్టర్ తొలగించి మరీ దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపులోకి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.2 కోట్లు విలువ చేసే వజ్రాలను అపహరించినట్లు షాపు సిబ్బంది తెలిపారు.

గోల్డ్ షాప్‌లో భారీ చోరీ.. రూ.2 కోట్ల వజ్రాల అపహరణ
Medipally Robbery

మేడ్చల్, అక్టోబర్ 5: మేడిపల్లిలోని ఓ బంగారం షాప్‌లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి షాపు షెట్టర్ తొలగించి మరీ దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపులోకి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.2 కోట్లు విలువ చేసే వజ్రాలను అపహరించినట్లు షాపు సిబ్బంది తెలిపారు. డైమెండ్స్‌తో పాటు బంగారు ఆభరణాలు కూడా చోరీకి గురైనట్లు మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వరంగల్ జాతీయ రహదారి మేడిపల్లి మెయిన్ రోడ్డులోని గోల్డ్ షాప్‌లో ఈ సంఘటన జరిగింది. ఈరోజు(సోమవారం) ఉదయం షాప్‌కు వచ్చిన సిబ్బంది చోరీ జరిగినట్లు గుర్తించారు.


వెంటనే పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. షాపులోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు ఏడు మంది దొంగలు చోరీ చేసినట్టు అనుమానిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే శాశ్వతం.. కొత్త ప్లాన్‌తో రూ.400 కోట్లు ఆదా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 12:04 PM