Share News

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Oct 05 , 2026 | 01:14 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
Supreme Court

ఢిల్లీ, అక్టోబర్ 5: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. భూముల వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. దేవాదాయ, ధర్మాదాయ ట్రైబ్యునల్‌కు వెళ్లాల్సిందేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జస్టిస్ విశ్వనాథన్, జస్టిన్ అరుణ్ ధర్మాసనం స్పష్టం చేసింది.


తిరుపతి జిల్లా ఎమ్మార్ పల్లి పరిధిలోని బుగ్గమఠానికి చెందిన భూములను పెద్దిరెడ్డి ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, పదిరోజుల్లో ఖాళీ చేయాలంటూ మఠం ఈవో మే నెలలో ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాల్‌ చేస్తూ.. పెద్దిరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈవో ఉత్తర్వులపై అభ్యంతరాలను నాలుగు వారాల్లోగా దేవాదాయ, ధర్మాదాయ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకోవాలని సింగిల్‌ బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై డివిజన్ బెంచ్‌కు వెళ్లగా.. సింగ్‌ బెంచ్ ఇచ్చిన నాలుగు వారాల గడువును మరో నాలుగు వారాలకు పెంచుతూ తీర్పు ఇచ్చింది. దీంతో పెద్దిరెడ్డి సుప్రీంకోర్టును పిటిషన్ వేశారు. తాజాగా అత్యున్నత న్యాయస్థానంలోనూ పెద్దిరెడ్డి ఎదురుదెబ్బే తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది.


ఇవి కూడా చదవండి...

విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు శంకుస్థాపన.. 4 వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్

కడప అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. గొడ్డలి పార్టీ అధినేతకు సీఎం చంద్రబాబు సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 01:36 PM