నికోలస్ పూరన్ విధ్వంసం.. టొరంటో సిక్సర్స్‌కు కెనడా సూపర్ 60 టైటిల్
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:41 PM
కెనడా సూపర్ 60 సీజన్-2 తుదిపోరులో టొరంటో సిక్సర్స్ ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. వాంకోవర్ యాంకర్స్‌తో జరిగిన మ్యాచ్ లో పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
కెనడా సూపర్ 60 సీజన్-2 తుదిపోరులో టొరంటో సిక్సర్స్ ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. వాంకోవర్ యాంకర్స్‌తో జరిగిన మ్యాచ్ లో పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో రెండు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 67 పరుగులు (291.30 స్ట్రైక్‌రేట్‌తో) చేశాడు. ఫలితంగా అతడి జట్టు వాంకోవర్ యాంకర్స్‌పై ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. అంతకుముందే మహిళల విభాగంలోనూ టొరొంటో జట్టు టైటిల్ సాధించింది. దీంతో ఈ టోర్నీ చరిత్రలో ఒకే సీజన్‌లో ఒకే ఫ్రాంచైజీకి చెందిన పురుషుల, మహిళల జట్టులు టైటిళ్లు గెలవడం గమనార్హం.
మ్యాచ్ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్ యాంకర్స్ 60 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓబస్ పీనార్ 21 బంతుల్లోనే అజేయంగా 82 పరుగులు చేసి.. జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. అలానే వాంకోవర్ యాంకర్స్ కెప్టెన్ మొయిన్ అలీ 18 బంతుల్లో 45 పరుగులు చేసి.. తృటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
165 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టొరంటో సిక్సర్స్‌కు నికోలస్ పూరన్ అదిరే ఆరంభాన్ని అందించాడు. అతడికి కెప్టెన్ కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్ సహకరించారు. పొలార్డ్ 13 బంతుల్లో 35 పరుగుల చేయగా.. డేనియల్ సామ్స్ 9 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సిక్సర్స్ చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుని.. టైటిల్‌ను ముద్దాడింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ ఒకప్పుడు మనం ఉన్నట్టుగా లేడు: అభిషేక్ శర్మ
స్లో ఓవర్ రేట్.. టీమిండియా, వెస్టిండీస్‌కు ఫైన్
నిప్పులు చేరిగిన భారత స్పిన్నర్.. 174 పరుగులకే కుప్పకూలిన ఆసీస్