Share News

హాంకాంగ్ సిక్సస్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా భువనేశ్వర్..

ABN , Publish Date - Oct 05 , 2026 | 03:31 PM

హాంకాంగ్ సిక్సస్ 2026 టోర్నీకి భారత జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్, టీమిండియా వెటరన్‌ భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహించనున్నాడు.

హాంకాంగ్ సిక్సస్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా భువనేశ్వర్..
Bhuvneshwar Kumar

హాంకాంగ్ సిక్సస్ 2026 టోర్నీకి భారత జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్, టీమిండియా వెటరన్‌ భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహించనున్నాడు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందుకోసం భారత్ బలమైన జట్టును ఎంపిక చేసింది.


టీమిండియా ఎంపిక చేసిన జట్టులో మొత్తం టీ20 స్పెషలిస్ట్‌లు ఉన్నారు. ఆర్సీబీలో భువీ సహచరుడు కృనాల్‌ పాండ్యా, ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్‌ నితీశ్‌ రాణా, పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శశాంక్‌ సింగ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ నటరాజన్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తివాతియా, రాహుల్‌ త్రిపాఠి ఈ జట్టులో స్థానం సంపాదించారు.


హాంకాంగ్ సిక్సస్ 2026 టోర్నీలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్న భువనేశ్వర్‌ కుమార్‌ దాదాపు మూడేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. అది కూడా కెప్టెన్‌గా ఎంపిక కావడం విశేషం.ఐపీఎల్‌2026లో ఆర్సీబీ తరఫున భువీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అలానే దేశవాళీ టీ20 టోర్నీల్లో సత్తా చాటాడు. వాస్తవానికి భువీని భారత సీనియర్‌ జట్టుకే ఎంపిక చేయాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే సెలెక్టర్లు ముందుగా హాంగ్‌కాంగ్‌ సిక్సస్‌ లాంటి కీలక టోర్నీకి ఎంపిక చేసి... అతడి ప్రదర్శనను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.


ఇక టోర్నీ విషయానికి వస్తే... గత ఏడాది ఫైనల్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన కువైట్‌ను ఓడించి, రికార్డు స్థాయిలో ఆరో హాంగ్ కాంగ్ సిక్సస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న పాకిస్థాన్, డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2026 ఎడిషన్‌లో అడుగుపెడుతోంది.ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది ప్రధాన క్రికెట్ దేశాలతో పాటు నాలుగు అసోసియేట్ సభ్య దేశాలు పాల్గొంటాయి.


హాంకాంగ్ సిక్సస్‌కు భారత జట్టు

భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, నితీశ్ రాణా, శశాంక్ సింగ్, టి. నటరాజన్, రాహుల్ త్రిపాఠి, రాహుల్ తెవాతియా.


ఇవి కూడా చదవండి:

వెస్టిండీస్‌తో తొలి టీ20: అర్ష్‌దీప్ రీఎంట్రీ.. సంజు ఔట్!

బ్యాట్‌కు తగలకుండానే బౌండరీ దాటిన బంతి.. ఈ వైరల్ వీడియో చూశారా?

వైభవ్ సూర్యవంశీ ఫామ్‌లో ఉన్నా ఆడించలేం.. కారణం చెప్పిన గంభీర్

Updated Date - Oct 05 , 2026 | 04:04 PM