Share News

నిప్పులు చేరిగిన భారత స్పిన్నర్‌.. 174 పరుగులకే కుప్పకూలిన ఆసీస్

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:12 PM

ఆస్ట్రేలియా అండర్‌ 19 జట్టుతో ఇవాళ(సోమవారం) మొదలైన రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. పదునైన బంతులు విసురుతూ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

నిప్పులు చేరిగిన భారత స్పిన్నర్‌.. 174 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
Australia U19

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా అండర్‌ 19 జట్టుతో ఇవాళ(సోమవారం) మొదలైన రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. పదునైన బంతులు విసురుతూ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్పిన్నర్‌ తన్మయ్‌ బలోడా 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది.మిగిలిన బౌలర్లలో అయాన్‌ అక్రమ్‌ రెండు, మోహిత్‌ ఉల్వా, ప్రియాన్షు సింగ్‌ చెరో వికెట్ పడగొట్టారు. బలోడాతో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో ఆసీస్‌ కనీసం 200 పరుగుల మార్కును కూడా తాకలేకపోయింది.


ఆసీస్ జట్టు తరఫున 37 పరుగులు చేసిన చార్లీ హెండర్సన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నీల్‌ పటేల్‌ (31), జేకబ్‌ పీట్జ్‌ (26), ప్యాట్రిక్‌ సుల్లివాన్‌ (20), థామస్‌ వసియో (14) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. కాగా, ఆస్ట్రేలియా అండర్‌ 19 జట్టు 3 వన్డేలు, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటిస్తోంది. ఈ టూర్‌ లో భాగంగా తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను యువ భారత జట్టు 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అనంతరం జరిగిన తొలి టెస్ట్‌లోనూ భారత్‌ ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో ఆసీస్ జట్టును యంగ్ ఇండియా చిత్తు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు

ఆ రికార్డులను సమర్పించండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం

Updated Date - Oct 05 , 2026 | 05:02 PM