Share News

అల్లూరి జిల్లాలో ఐదు నెలల పసిబిడ్డ అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:33 PM

అల్లూరి జిల్లాలోని చింతపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదు నెలల పసిబిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కన్నతండ్రే బిడ్డను హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

అల్లూరి జిల్లాలో ఐదు నెలల పసిబిడ్డ అనుమానాస్పద మృతి
Alluri District

అల్లూరి జిల్లా, అక్టోబర్ 5: జిల్లాలోని చింతపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదు నెలల పసిబిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కన్నతండ్రే బిడ్డను హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. చిన్నారి తల్లి ప్రతిరోజూ బిడ్డను కన్నతండ్రి వద్దే ఉంచి పనిచేసేందుకు హోటల్‌‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఈరోజు కూడా అలాగే వెళ్లగా.. కాసేపటికి ఆకలికి ఏడవడంతో తండ్రి.. బిడ్డను తీసుకుని హోటల్‌కు వెళ్లి తల్లితో పాలుపట్టించినట్లు తెలుస్తోంది. అనంతరం చిన్నారిని తిరిగి ఇంటికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.


తండ్రి గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి చిన్నారిపై దాడి చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదు నెలల చిన్నారి మృతికి అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చిన్నారి మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ మొదలుపెట్టారు. పసిబిడ్డ మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


ఇవి కూడా చదవండి...

రాంబిల్లి సెజ్‌లో కొత్త విద్యుత్ ఉపకేంద్రం.. పరిశ్రమలకు మెరుగైన విద్యుత్ సరఫరా

విజయవాడ దసరా వేడుకలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఆహ్వానం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 04:34 PM