రష్యాలో మిస్టరీ అనారోగ్యంతో ల్యాబ్ ఉద్యోగి మృతి.. 200 మందికి క్వారంటైన్..
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:25 PM
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ ల్యాబొరేటరీ ఉద్యోగి అంతుచిక్కని అనారోగ్యంతో మరణించడం కలకలం రేగింది. 28 ఏళ్ల డార్యా షిపిలోవా అనే మహిళ తీవ్ర న్యూమోనియా లక్షణాలతో మృతి చెందింది. ఆమె ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ ల్యాబొరేటరీ ఉద్యోగి అంతుచిక్కని అనారోగ్యంతో మరణించడం కలకలం రేగింది. 28 ఏళ్ల డార్యా షిపిలోవా అనే మహిళ తీవ్ర న్యూమోనియా లక్షణాలతో మృతి చెందింది. ఆమె ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తోంది. ఆమెతో సంబంధం ఉన్న దాదాపు 200 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం. డార్యాకు ప్లేగు సోకిందని రష్యా అధికారులు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు (Russia lab worker death).
డార్యా షిపిలోవా సెప్టెంబర్ 29న తీవ్ర న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. అక్టోబర్ 2న ఆమె మరణించారు. డార్యా పనిచేస్తున్న సంస్థ ప్లేగు వ్యాధిపై పరిశోధనలు చేసే సంస్థ కావడంతో అమె మృతిపై అనుమానాలు మరింత పెరిగాయి. ఆమెకు ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో సోకిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలితో సంబంధం ఉన్న వ్యక్తులను అధికారులు గుర్తించి వైద్య పర్యవేక్షణలో ఉంచారు. పలు ఆసుపత్రుల్లో క్వారంటైన్ చర్యలు చేపట్టినట్లు రష్యా, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి (Russia mystery illness).
ఇప్పటివరకు పర్యవేక్షణలో ఉన్న వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలు కనిపించలేదని, వారి పరీక్షల ఫలితాలు కూడా నెగెటివ్‌గా ఉన్నాయని ఇర్కుట్స్క్ గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ వెల్లడించారు. ల్యాబ్‌లో డార్యా పనిచేస్తున్న సమయంలో ప్లేగుకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలిందని, దాంతో ఆమెకు ఇన్ఫెక్షన్ సోకిందని రష్యా స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వాదనను రష్యా ఆరోగ్య సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్ ఖండించింది. ప్రస్తుతం రష్యా ఆరోగ్య అధికారులు ఆమె అనారోగ్యాన్ని 'తెలియని కారణంతో వచ్చిన న్యూమోనియా'గా పేర్కొంటున్నారు (Russia quarantine).
ప్లేగుకు కారణమయ్యే యెర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసినప్పుడు దాన్ని న్యూమోనిక్ ప్లేగ్ (Pneumonic plague Russia) అంటారు. ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వేగంగా వ్యాపిస్తుంది. అయితే ప్రస్తుత రష్యా ఘటనలో మృతురాలికి ఇదే వ్యాధి సోకిందని అధికారిక నిర్ధారణ మాత్రం లేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంటాక్ట్ ట్రేసింగ్, వైద్య పర్యవేక్షణ, క్వారంటైన్ వంటి చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..