Share News

బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అత్యవసర పరిస్థితి.. ఒక్కసారిగా 28 వేల అడుగుల కిందకు..

ABN , Publish Date - Oct 05 , 2026 | 08:45 PM

లండన్ నుంచి అమెరికాలోని చికాగో విమానాశ్రయానికి వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో సోమవారం అత్యవసర పరిస్థితి ఏర్పడింది. లండన్ హీత్రూ నుంచి చికాగోకు వెళ్తున్న బీఏ295 విమానం ఐర్లాండ్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందకు దిగింది.

బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అత్యవసర పరిస్థితి.. ఒక్కసారిగా 28 వేల అడుగుల కిందకు..
British Airways flight emergency

ఇంటర్నెట్ డెస్క్: లండన్ నుంచి అమెరికాలోని చికాగో విమానాశ్రయానికి వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో సోమవారం అత్యవసర పరిస్థితి ఏర్పడింది. లండన్ హీత్రూ నుంచి చికాగోకు వెళ్తున్న బీఏ295 విమానం ఐర్లాండ్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందకు దిగింది. విమానం సుమారు 28 వేల అడుగుల మేర వేగంగా కిందకు దిగినట్లు విమాన ట్రాకింగ్ సమాచారం వెల్లడించింది. అనంతరం పైలట్లు అంతర్జాతీయ అత్యవసర సంకేతమైన 7700ను ప్రసారం చేశారు (British Airways BA295).


బోయింగ్ 777-200ఈఆర్ విమానం లండన్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం సుమారు 11.50 గంటలకు బయలుదేరింది. చికాగోకు దాదాపు 8 గంటల 40 నిమిషాల ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే విమానం సుమారు 37 వేల అడుగుల ఎత్తులో ఐర్లాండ్ మీదుగా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వేగంగా కిందకు దిగింది. కొద్ది నిమిషాల్లోనే దాదాపు 9 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. పైలట్లు అంతర్జాతీయ అత్యవసర సంకేతమైన 7700ను ప్రసారం చేశారు (London Chicago flight emergency).


చివరకు ఆ విమానం చికాగో వెళ్లకుండా తిరిగి లండన్ వైపు మళ్లినట్టు సమాచారం (British Airways flight emergency). అయితే విమానంలో ఏర్పడిన సమస్యకు ఖచ్చితమైన కారణాన్ని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఇప్పటివరకు వెల్లడించలేదు. అందువల్ల విమానం ఎందుకు అంత వేగంగా కిందకు దిగాల్సి వచ్చిందనే విషయంపై సమాచారం లేదు. కాగా, ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..


మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 05 , 2026 | 08:47 PM