యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం బద్దలు కొట్టి.. రూ.32 లక్షల చోరీ
ABN , Publish Date - Oct 06 , 2026 | 09:32 AM
శంషాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం బద్దలు కొట్టి.. రూ.32 లక్షల నగదు అపహరించారు.
హైదరాబాద్, అక్టోబర్ 06: శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సతంరాయిలో మంగళవారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం బద్దలు కొట్టి.. రూ.32 లక్షల నగదు అపహరించారు. అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఏటీఎం గది తలుపు మూసి.. సీసీటీవీ కెమెరాల మీద స్ప్రే కొట్టారని తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 3.07 గంటలకు గ్యాస్ కట్టర్‌తో వచ్చిన నిందితుడు.. ఏటీఎంను కట్ చేశాడని చెప్పారు. కేవలం 20 నిమిషాల్లోనే ఏటీఎంలో నగదు చోరీ చేసి పరారయ్యాడని పేర్కొన్నారు.
అయితే గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్ కట్ చేయగానే.. అలారం మోగడంతో ముంబైలోని యాక్సిక్ బ్యాంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారని అన్నారు. 3.30 గంటలకు పోలీసులకు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో వారు సంతరాయిలోని ఏటీఎం వద్దకు చేరుకొనేటప్పటికే.. దొంగ అక్కడి నుంచి నగదుతో పరారయ్యాడని పోలీసులు వివరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. అందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని శంషాబాద్ పోలీసులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేడ్చల్‌లో బంగారం షాపు చోరీ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
సంగారెడ్డి జిల్లాలో మూడు ఎకరాల మామిడితోట దగ్ధం..