యూరియా యాప్‌తో ఇక్కట్లు..
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:12 PM
ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్‌తో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్ యాప్‌లతో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది.
రైతులకు అవగాహన కరువు
లక్షెట్టిపేట(మంచిర్యాల): ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్‌తో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్ యాప్‌లతో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రస్తుతం యూరియాతో పాటు డీఏపీ, పొ టాస్, 20.20అన్ని కూడా ఆన్‌లైన్ చేసుకోవాలని ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోవాలన్న నిబంధనలు పెట్టడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది రైతులకు యాప్‌లపై అవగాహన కూడా లేకపోవడం ఒకెత్తయితే మరికొంత మందికి అసలు స్మార్ట్ ఫోన్లుకూడా లేకపోవడం మరో సమస్య. చేసేది లేక చాలా మంది తమ బంధువులు, తెలిసిన వాళ్లతో బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి.
స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి....
ప్రభుత్వం రైతులకు అందించే యూరియా, డీఏపీ, పొటాస్, 20.20 సాగుకోసం రైతులు పొందాలంటే యా ప్‌లో బుక్ చేసుకోవాలి. అది బుక్ చేసుకోవాలంటే ముందుగా స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి. అంతే కాకుండా ఆధా ర్ కార్డుతో అనుసంధానం అయిన ఫోన్‌నంబర్ కలిగి ఉండాలి. దీంతో పాటు రైతుకు సంభందించిన పట్టాదారు పాసు పుస్తకం సైతం ఫోన్ నంబర్‌కు లింక్ ఉండి పూర్తి వివరాలను యాప్‌లో పొందుపర్చాలి. ఆతర్వాత సంబంధిత యాప్‌లో అడిగిన విధంగా బుక్ చేసు కో వాలి. ఇలా రైతులు బుక్ చేసుకోవాలంటే సుమారు 20 నుంచి30నిమిషాలు మోబైల్‌లో బుక్ చేసుకుంటేనే రైతులకు కావాల్సిన సరుకులు పొందగలుగుతారు.
రవాణా భారం కూడా రైతులపైనే..
ఎకరాకు ఒక బస్తా చొప్పున రైతులు అష్టకష్టాలు పడి ఇతరుల సాయం కోరి బుక్ చేసుకున్న సరుకు ఇదే మండలంలో ఉండా లేక పక్క మండలంలో ఉన్న ఫర్టి లైజర్ దుకాణాల్లో ఉందా రైతులకు మెజెజ్ రావడంతో రైతులు ఆటోలోనే ఇతర వాహనాల్లోనో అక్కడికి వెళ్లి సరుకులు కొనుక్కోవాల్సి వస్తుంది. రైతులు అలా దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవడం వల్ల రైతులపై రవాణా భారం కూడా పడటంతో పాటు రైతుల సమయం చాలా వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకు స్మార్ట్ ఫోన్ లేదు...
పెండ్యాల భీమయ్య, రైతు కొత్తూర్ గ్రామం
నాకు చదువు రాదు. సెల్ ఫోన్ వాడుడు రాదు. నాకున్న పొలంలో నేను సాగు చేసుకుంటున్న. నాకు ఇప్పుడు యూరియా కావాలంటే బుక్ చేసుకోవాలని అంటున్నారు. యూరియా దొరకకుంటే వ్యవసాయం ముందుకు పోదు. మాలాంటి వారి పరిస్థితి ఏంటి. మునిపటి లెక్క దుకాణాలకు వెళ్లి యూరియ ఎరువులు దొరికేట్లు చేసి నాలాంటి రైతులను ఆదుకొండి సారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బ్యాంకు సేవలకు 5 రోజుల బ్రేక్
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే
Read Latest AP News And Telangana News And International News And Telugu News