Share News

ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు రథసారథి ఆయనే..!

ABN , Publish Date - Sep 25 , 2026 | 10:26 AM

ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు రథసారథి ఎవరో తెలుసా? సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటరెడ్డికి ఈ అవకాశం దక్కింది.

ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు రథసారథి ఆయనే..!
khairatabad ganesh procession

ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (శుక్రవారం) ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా లక్షల భక్తుల మధ్య వినాయకుడి విగ్రహాన్ని శోభాయాత్రగా ట్యాంక్‌బండ్‌వైపు తీసుకువెళ్లనున్నారు. అయితే ఈ శోభాయాత్రకు రథసారథి ఎవరో తెలుసా..? సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండాలనికి చెందిన మందడి వెంకటరెడ్డి ఈ ఏడాది శోభాయాత్రకు ఉపయోగించే భారీ ట్రక్‌కు డ్రైవర్‌గా పనిచేయబోతున్నారు.


ఆయన ఇప్పటికే మూడు సార్లు గణేశ్ శోభాయాత్రకు రథసారథిగా వ్యవహరించారు. లక్షల భక్తుల మధ్య మహాగణపతిని మోస్తున్న భారీ వాహనాన్ని నడపాలంటే చాలా నైపుణ్యం కావాలి. విజయవాడ ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టులో 26 ఏళ్లు పనిచేసిన ఆయనకు ఎనలేని అనుభవం ఉంది. ఈ అనుభవమే ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు రథసారథ్యం వహించే అవకాశం తెచ్చిపెట్టింది. 2017, 2020, 2025 సంవత్సరాల్లో నిమజ్జనోత్సవంలోని భారీ ట్రక్‌కు డ్రైవర్‌గా వెంకటరెడ్డి పనిచేశారు. 2026లోనూ తనకీ అదృష్టం దక్కిందని ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Untitled-2 copy.jpg


ఈ వార్తలూ చదవండి

టస్కర్ పైకి ఖైరతాబాద్‌ మహాగణపతి.. మరికాసేపట్లో శోభాయాత్ర

ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..

Updated Date - Sep 25 , 2026 | 10:38 AM