బ్యాంకు సేవలకు 5 రోజుల బ్రేక్
ABN , Publish Date - Sep 25 , 2026 | 10:50 AM
దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం 72గంటల పాటు మూడు రోజులు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.
రేపు, ఎల్లుండి సాధారణ సెలవులు
28 నుంచి 30 వరకు ఉద్యోగుల సమ్మె
వరంగల్: దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం 72గంటల పాటు మూడు రోజులు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఈ సందర్భంగా 12 యూనియన్లకు చెందిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారు. ఈ నెల 26న నాలుగో శనివారం కావడంతో బంద్, ఆదివారం సెలవు, 28 ,29, 30 తేదీలలో మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించనున్న నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ముందస్తు గానే అధికారులు ఖాతాదారులకు సమాచారం అందిస్తూ మెస్సేజ్‌ల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవడానికి ముందుగానే సమాచారం అందిస్తున్నారు.
మొత్తానికి ఐదు రోజుల పాటు బ్యాంకులు తమ కార్యకలాపాలను ని ర్వహించడంలో సమ్మె ప్రభాపం వల్ల ఎలాంటి లావాదేవీలు కొనసాగవు. ఒక దశలో ఆదివారం బ్యాంకులను తెరిచి ఉంచాలని లావా దేవీలు నిర్వహించాలని అధికారులు యోచి స్తున్నారు. నేడు శుక్రవారం లావాదేవీలకు పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. ఈ సందర్భంగా బ్యాంకుల సమ్మెలో సిబ్బంది అందరూ పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగులు తెలుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే
ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..
Read Latest AP News And Telangana News And International News And Telugu News