రేవంత్ వ్యాఖ్యలు అంబేడ్కర్ ఆశయాలకు వ్యతిరేకం: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:23 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి బంట్రోతు పోస్ట్ దొరకదని అంటున్నారని.. ప్రజలను బంట్రోతులుగా చూస్తున్నారా అని ఆగ్రహించారు.
ఢిల్లీ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (KishanReddy) ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి బంట్రోతు పోస్ట్ దొరకదని అంటున్నారని.. ప్రజలను బంట్రోతులుగా చూస్తున్నారా అని ఆగ్రహించారు. ఈరోజు (మంగళవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవంగా టీడీపీ పుట్టిందని ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉపరాష్ట్రపతులుగా ఉన్నారని ప్రస్తావించారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా పని చేశారని, తాను ఒక్కడినే మేధావిని అనుకుని అద్దాల మేడలో కూర్చుని సీఎం రాళ్లు వేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. దేశం మొత్తం ఒకటి కాదా అని ప్రశ్నించారు.
వారు ఎక్కడి నుంచి పోటీ చేశారు..?
బీజేపీ నేత లక్ష్మణ్ వలస పోయారని సీఎం అంటున్నారని.. మరి ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఎక్కడి నుంచి పోటీ చేశారని కిషన్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ బుద్ధితో నడిపిస్తే, రేవంత్ రెడ్డి డబ్బులతో నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కి అధికారికంగా కోశాధికారిగా పని చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. డీలిమిటేషన్‌తో ఎన్ని సీట్లు పెరుగుతాయనేది పార్లమెంట్ సమావేశాల్లో తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి హైబ్రిడ్, జీడీపీ పరంగా సీట్లు పెరగాలని అంటున్నారని, ప్రపంచలో ఇది ఎక్కడా లేదని అన్నారు. అలాంటప్పుడు అసెంబ్లీ సీట్లు ఆదిలాబాద్, ఖమ్మంలో తగ్గిస్తారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.హైదరాబాద్‌లో మాత్రమే సీట్లు పెంచుతారా..? అనేది సీఎం చెప్పాలని నిలదీశారు. 70 శాతం రెవెన్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తోందని తెలిపారు.
రేవంత్ రెడ్డి వితండవాదలు పక్కన పెట్టాలి..
దేశంలో రాహుల్ గాంధీ తర్వాత అంతటి మేధావి రేవంత్ రెడ్డేనని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభజన తీసుకొచ్చే విధంగా సీఎం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తప్పుడు మాటలు మాట్లాడొద్దని, వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. సీఎం వ్యాఖ్యలు బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి వితండవాదలు పక్కన పెట్టాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీలిమిటేషన్‌తో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి
లవ్ జిహాద్ కేసుపై బండి సంజయ్ ఘాటు స్పందన
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. అడ్వకేట్‌కు డ్రంకెన్ టెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News