Share News

తెలంగాణను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:29 PM

తెలంగాణను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
Telangana Minister Sridhar Babu

హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Telangana Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) గచ్చిబౌలిలో తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ – 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో అంతర్జాతీయ పోటీలు కొనసాగుతున్నాయి. నవంబరు 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.


ఈ పోటీల్లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని, ప్రసంగించారు. క్రీడారంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా తాము చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటే క్రీడాకారులకు తమ ప్రభుత్వ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. దేశ, రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను పెంచే క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం కల్పిస్తామని స్పష్టం చేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క

భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 06:37 PM