Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల కుటుంబాల్లో దీపావళి వెలుగులు: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Nov 07 , 2026 | 02:59 PM

దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న పేదల సొంతింటి కలను తమ ప్రభుత్వంలో సాకారం చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల కుటుంబాల్లో దీపావళి వెలుగులు నింపామని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల కుటుంబాల్లో దీపావళి వెలుగులు: మంత్రి పొన్నం ప్రభాకర్
Telangana Minister Ponnam Prabhakar

సిద్దిపేట జిల్లా, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న పేదల సొంతింటి కలను తమ ప్రభుత్వంలో సాకారం చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల కుటుంబాల్లో దీపావళి వెలుగులు నింపామని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డులో ‘మన ఇందిరమ్మ ఇళ్ల’ల్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల యజమాని పొన్నం కోమల, సమ్మయ్య ముదిరాజ్ కుటుంబానికి బట్టలు పెట్టి, స్వీట్లు తినిపించి, మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దీపావళి సందర్భంగా లబ్ధిదారుడి ఇంట్లో క్రాకర్స్, బాణాసంచా కాల్చి పండుగను చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.


హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో పూర్తయిన 2,500కు పైగా ఇందిరమ్మ ఇళ్లల్లో దీపావళి సంబరాలు జరుపుతున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. రెండో దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను వారం పది రోజుల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించే ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరడం లబ్ధిదారుల కుటుంబాలకు ఎంతో సంతోషకరమైన విషయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మరో ఐదు పట్టణాలకు ఇందిరమ్మ ఇళ్లు

రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు: సీఎం డీకే శివకుమార్

మైనార్టీల విద్య, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 03:26 PM