Share News

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:08 PM

కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు:  మంత్రి పొన్నం ప్రభాకర్
Telangana Minister Ponnam Prabhakar

హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో (Central Budget) తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రేపటి పౌర్ణమి తెలంగాణకు వెలుగులు తెస్తుందా..? , చీకటి ఇస్తుందా..? చూడాలని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


తెలంగాణకు న్యాయం చేయాలి..

కనీసం ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకత ఉందన్నారు. రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి తెలంగాణ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించారు. ఈ విషయంపై కేంద్రానికి, బీజేపీకి చివరిసారిగా గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర విద్యాసంస్థల స్థాపనకు మోదీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తెలంగాణకి వస్తే తాము గౌరవంగా కలుస్తున్నామని ప్రస్తావించారు. పక్క రాష్ట్రాలకి నిధులు కేటాయిస్తే తాము తప్పు పట్టడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 05:18 PM