Share News

మహిళలు ధైర్యంగా పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతం: డీజీపీ ఆనంద్

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:22 PM

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారిత సాధించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. దాని కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో స్త్రీ రైడ్స్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

మహిళలు ధైర్యంగా పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతం: డీజీపీ ఆనంద్
Telangana DGP CV Anand

హైదరాబాద్, జూన్6 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారిత సాధించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) వ్యాఖ్యానించారు. దాని కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో స్త్రీ రైడ్స్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. 55 మంది మహిళలకు డ్రైవింగ్ నేర్పించి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు గిగ్ వర్క్‌లో పురుషులు ఉండేవారని, ఇప్పటినుంచి మహిళలు కూడా రాబోతున్నారని తెలిపారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్ వేదికగా డీజీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు.


హైదరాబాద్ సిటీ పోలీస్ చరిత్రలో లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్‌కు.. మహిళా ఎస్‌హెచ్‌వో లేరని డీజీపీ ఆనంద్ వివరించారు. తాను హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళా ఇన్‌స్పెక్టర్లను ఎస్‌హెచ్‌వోలుగా నియమించానని ప్రస్తావించారు. ఇప్పుడు 55 మంది మహిళలు ప్యాసింజర్ రవాణా సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణ అంతటా లాజిస్టిక్, కార్గో, డెలివరీ సర్వీసెస్‌లో మహిళా డ్రైవర్లకు అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. దేశ జీడీపీ పెరగాలంటే మహిళలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి పని చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 05:08 PM