Share News

కేసీఆర్ హయాంలోనే ఆంధ్రాలో ప్రాజెక్టులు చేపట్టారు.. సీఎం రేవంత్ ధ్వజం

ABN , Publish Date - Nov 22 , 2026 | 03:47 PM

మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే ఆంధ్రాలో ప్రాజెక్టులు చేపట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం చేశారని గుర్తుచేశారు.

 కేసీఆర్ హయాంలోనే ఆంధ్రాలో ప్రాజెక్టులు చేపట్టారు.. సీఎం రేవంత్ ధ్వజం
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే ఆంధ్రాలో ప్రాజెక్టులు చేపట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం చేశారని గుర్తుచేశారు. దాని ఆధారంగానే ఏపీలో ప్రాజెక్టులు చేపట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల భూ సేకరణకు కూడా కేసీఆర్ హయాంలో ఎందుకు నిధులు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. ఈరోజు (ఆదివారం) పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.


మా హయాంలో ఏపీలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు..

2022లో కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం మొదలైందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రూ.1580 కోట్లకు కేంద్రప్రభుత్వం జల్ జీవన్ మిషన్ - 2022 లోన్ జీఓ తీసుకువచ్చిందని చెప్పుకొచ్చారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు అప్పటి టీఆర్ఎస్ మంత్రి వర్గంలో ఉన్నపుడే మొదలైందని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 05:05 PM