ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:46 PM
కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూళ్లల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉండాలని సూచించారు. ఇవాళ(గురువారం) ఐసీసీసీలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌పైన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి , విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా , కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు.
బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలి..
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో తప్పనిసరిగా పాలు అందజేయాలని నిర్దేశించారు. ఇందుకోసం విజయా డైరీ నుంచి పాలు సేకరించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీని వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక మండలంలో ఆరుట్ల స్కూల్ తరహాలో ట్రాన్స్‌పోర్ట్‌తో సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఎలక్ట్రికల్ బస్సులపై అధ్యాయనం చేయాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ట్రాన్స్‌పోర్ట్ కోసం ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటు పైన అధ్యాయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు రికవరీ చేసేలా నిబంధన విధించాలని హుకుం జారీ చేశారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణకు సంబంధించి రికమండేషన్స్‌ని ప్రజాభిప్రాయం కోసం వెబ్‌సైట్‌లో ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలాగే, ఎంసీహెచ్ఆర్డీలో గ్రూప్ 2, 3 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్
ఖర్గేని కలిసిన జగ్గారెడ్డి.. అసలు విషయమిదే..
Read Latest Telangana News And AP News And Telugu News