పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:37 AM
పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ తెలంగాణగా మార్చామని ఉద్ఘాటించారు.
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల పోలీస్ సమన్వయ కమిటీ భేటీ ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళం డీజీపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
తమ హయాంలో హైడ్రా, ఈగల్, ఈజీ సేఫ్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నార్కోటిక్స్ నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ తెలంగాణగా మార్చామని ఉద్ఘాటించారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మా ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత నాది: సీఎం రేవంత్‌రెడ్డి
టీడీఆర్ సేవలకు ఆధార్‌తో గుర్తింపు నిర్ధారణకు ప్రభుత్వం అనుమతి
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News