టీడీఆర్ సేవలకు ఆధార్‌తో గుర్తింపు నిర్ధారణకు ప్రభుత్వం అనుమతి
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:53 PM
టీడీఆర్ సేవలకు ఆధార్‌తో గుర్తింపు నిర్ధారణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లకు వర్తింపచేస్తున్నట్లు స్పష్టం చేసింది.
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): టీడీఆర్ సేవలకు ఆధార్‌తో గుర్తింపు నిర్ధారణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లకు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్, లాగిన్, దరఖాస్తుల ప్రక్రియలో ఆధార్ వినియోగించవచ్చని తెలిపింది. ప్రాపర్టీ డేటాబేస్‌తో ఆధార్ అనుసంధానానికి అవకాశం కల్పిచింది. DTCP, GHMC అధికారులకు ఆన్‌లైన్ అథెంటికేషన్ సదుపాయం కల్పించింది. నకిలీ గుర్తింపులు, మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యమని రాష్ట్ర సర్కార్ పేర్కొంది. ఆధార్ అథెంటికేషన్ స్వచ్ఛందమేనని.. తప్పనిసరి కాదని స్పష్టంచేసింది. ఈ మేరకు జీవో నంబర్ - 255ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక
Read Latest AP News And Telugu News