Share News

ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగించిన ప్రభుత్వం

ABN , Publish Date - Oct 22 , 2026 | 03:13 PM

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పదవీకాలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవి విరమణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే.

ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగించిన ప్రభుత్వం
Sai Prasad Tenure Extension

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పదవీకాలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవి విరమణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సాయిప్రసాద్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిపై సాయిప్రసాద్ పదవీకాలాన్ని ఆరు నెలల పాటు డీఓపీటీ పొడిగించింది. దీంతో వచ్చే ఏడాది మే 30వ తేదీ వరకు చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్ కొనసాగనున్నారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం

నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2026 | 03:23 PM