Share News

హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN , Publish Date - Feb 23 , 2026 | 08:28 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ(సోమవారం) క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Telangana Cabinet

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ(సోమవారం) క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోని నిర్వహిస్తున్న ఎల్అండ్‌టీ నుంచి పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం మార్చి 31వ తేదీలోపు మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ టేకోవర్ మొత్తం విలువ సుమారు రూ.15,000 కోట్లుగా అంచనా వేసింది. ఇందులో మెట్రోపై ఉన్న అప్పులు రూ.13,000 కోట్లు కాగా, ఎల్ అండ్‌టీ సంస్థ ఈక్విటీ వాటా రూ.2,000 కోట్లుగా ఉంది.


కేంద్ర అనుమతుల కోసం కీలక అడుగు..

మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే మొదటి దశ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.


మెట్రో టేకోవర్ వల్ల ప్రయోజనాలు..

ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో వచ్చిన తర్వాత.. మెట్రో విస్తరణ వేగవంతం అవుతుంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. రవాణా వ్యవస్థపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. భవిష్యత్ ప్రాజెక్టులకు కేంద్ర సహాయం పొందడం సులభం అవుతుంది. ఇది నగర అభివృద్ధికి కీలక నిర్ణయంగా భావిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 23 , 2026 | 08:49 PM