Share News

రాయదుర్గం భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Aug 06 , 2026 | 08:55 PM

రాయదుర్గం భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. TGIIC దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశించిన డ్రోన్ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

రాయదుర్గం భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court

ఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాయదుర్గం భూముల కేసులో (Raidurgam Land Case) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. టీజీఐఐసీ (TGIIC) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసిందని తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించిన డ్రోన్ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. తమ వాదనలు వినకుండానే సర్వే ఆదేశాలు ఇచ్చారని టీజీఐఐసీ వాదనలు వినిపించింది.


అయితే, హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆగస్టు 14వ తేదీ వరకు టీజీఐఐసీకి గడువు విధించింది. ఆ లోగా హైకోర్టులో సవరణ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. రాయదుర్గం సర్వే నంబర్ -83/2లోని 46 ఎకరాల భూమిని వేలం వేసే ప్రతిపాదన లేదని సుప్రీంకోర్టుకు టీజీఐఐసీ సీనియర్ న్యాయవాది తెలిపారు.


వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 09:03 PM