Share News

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jun 04 , 2026 | 07:35 AM

వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

ఎలహంక-బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు
Special Trains

హైదరాబాద్‌ సిటీ: వేసవి రద్దీ నేపథ్యంలో ఎలహంక -బిలాస్‏పూర్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేకరైళ్లు జూలై 2వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటు ఉంటాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. 08261 ప్రత్యేకరైలు బిలాస్‏పూర్‌ నుంచి ప్రతీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి గురువారం రాత్రి 7 గంటలకు ఎలహంకకు చేరుకుంటుందని, 08262 ప్రత్యేకరైలు ఎలహంక నుంచి ప్రతీ గురువారం రాత్రి 9.30 గంటలకు బయల్దేరి శనివారం తెల్లవారు జామును 3.30గంటలకు బిలాస్‏పూర్‌ చేరుకుంటుందని వెల్లడించారు.


city1.2.jpgమార్గమధ్యంలో ఈ ప్రత్యేకరైళ్లకు భాటాపర, రాయ్‌పూర్‌, దుర్గ్‌, రాజన్‌దగాం, దోనాగార్గ్‌, గోండియా, వాడ్సా, చందాఫోర్ట్‌, బలార్ష, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, మంచిర్యాల, ఖాజీపేట్‌, చర్లపల్లి, సికింద్రాబాద్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూర్‌, యాద్గిర్‌, కృష్ణా, రాయ్‌చూర్‌, మంత్రాలయం, గుంతకల్‌, గుత్తి, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో హాల్ట్‌ కల్పించినట్లు సీపీఆర్‌ఓ పేర్కొన్నారు.


city1.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..

లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 07:35 AM