Share News

ఇలా వండాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:11 AM

తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రొటీన్లు, తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు, పీచులతో నిండిన క్వినోవా అందించే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు దాన్ని ఎలా వండాలో తెలుసుకుందాం...

ఇలా వండాలి

తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రొటీన్లు, తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు, పీచులతో నిండిన క్వినోవా అందించే ఆరోగ్య ప్రయోజనాలతోపాటు దాన్ని ఎలా వండాలో తెలుసుకుందాం...

  • ఉడికించిన క్వినోవాను తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పటికీ చాలాసేపటి వరకు కడుపు నిండుగా ఉన్నట్లే అనిపిస్తుంది. ఇతరత్రా చిరుతిళ్ల మీదికి ధ్యాస మళ్లదు. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

  • క్వినోవా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. కాబట్టి దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం దరిచేరదు.

  • రోజూ క్వినోవాను ఆహారంలో చేర్చుకుంటే.. దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.ఎలా వండాలంటే...

  • క్వినోవా గింజలపై చేదుగా ఉండే సపోనిక్‌ పొర ఉంటుంది. దీన్ని తొలగించేందుకు కనీసం మూడుసార్లు నీళ్లతో కడగాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి రెండు కప్పుల నీటిని పోసి చిటికెడు ఉప్పు, చెంచా ఆలివ్‌ నూనె లేదా నెయ్యి వేసి బాగా మరిగించాలి. ఆపైన కప్పు క్వినోవా వేసి కలిపి మూతపెట్టి చిన్న మంట మీద పావుగంటసేపు ఉడికించాలి. తరువాత స్టవ్‌ మీద నుంచి దించి అయిదు నిమిషాలు అలాగే ఉంచాలి. అంతే పొడిపొడిగా క్వినోవా సిద్ధమవుతుంది.

  • దీనిలో సన్నగా తరిగిన కీరా ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, రెండు చెంచాల నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర తరుగు, అర చెంచా మిరియాల పొడి వేసి బాగా కలిపి సలాడ్‌లా తయారుచేసుకుని తినవచ్చు. ఉడికించిన కూరగాయల ముక్కలు, బఠానీలు వేసి కలిపి కొద్దిగా తాలింపు పెట్టి ఉప్మా లేదా కిచిడీలా చేసుకుని తినవచ్చు. తగినంత పెరుగు కలిపి పచ్చిమిర్చి, కరివేపాకుతో పోపు పెట్టి తింటే వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి..

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

Updated Date - Jun 04 , 2026 | 12:11 AM