సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. జులై 6కు విచారణ వాయిదా
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:17 PM
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా, సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారు.
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు (Sandhya Theatre Stampede Case) సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా, సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అనంతరం ఈ కేసు విచారణను జులై 6వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. ఇవాళ వ్యక్తిగతంగా బన్నీ కోర్టు ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అయితే అల్లు అర్జున్ గైర్హాజరుకు గల కారణాలను న్యాయస్థానానికి ఆయన తరఫు న్యాయవాది వివరించారు.
A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని చేర్చగా, మొత్తం 23 మందిపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఈ ఘటన 2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసు దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా పేర్కొంటూ నాంపల్లి కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించారు. నిందితుల వ్యక్తిగత హాజరు ప్రక్రియ పూర్తైన తర్వాత ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు నాంపల్లి కోర్టు సిద్ధమవుతోంది. ఈ కేసు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారగా, కోర్టు తదుపరి విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్
ఆరోగ్య తెలంగాణకు యోగానే మార్గం: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News