Share News

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా క్షీణించింది: రాంచందర్ రావు

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:09 PM

సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా క్షీణించింది: రాంచందర్ రావు
Ramchander Rao

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ధ్వజమెత్తారు. 22ఏతో మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో రాంచందర్ రావు పాల్గొని మాట్లాడారు. 22ఏ భూ భారతి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. భూ సంస్కరణల పేరుతో భూ భారతిని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకువచ్చారని అన్నారు.


22ఏ భూముల వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలి..

గతంలో 15 శాతం కమీషన్‌ ఉంటే.. ఇప్పుడు 30 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. 22ఏ భూముల వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దొందూ దొందే అని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 04:31 PM