Share News

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం: 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:49 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దు అయ్యాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం: 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
Flight Cancellations

హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మన హైదరాబాద్ ప్రయాణికులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావంతో 13 అంతర్జాతీయ సర్వీసులు రద్దు అయ్యాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమానాలు ఈరోజు (శనివారం) రద్దు అయ్యాయి. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.


రద్దయిన విమానాల వివరాలిలా..

మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా ఆయా దేశాల ఎయిర్ స్పేస్ (వాయు మార్గం) తాత్కాలికంగా మూసివేశారు. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడుల వల్ల అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ పూర్తిగా ప్రభావితమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రధానంగా ఈ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి. యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇజ్రాయిల్ విమానాలు రద్దు అయ్యాయి.


ప్రయాణికుల కోసం సూచనలు..

విమానాల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉన్న ప్రయాణికులకు అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రయాణికులు మీ విమానానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి సంబంధిత ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపారు. టికెట్ రీ-బుకింగ్ లేదా రీ-రూటింగ్ కోసం ఎయిర్‌లైన్ ప్రతినిధులతో మాట్లాడాలని అన్నారు. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయని... ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందే తమ విమాన సమయాలను ఒకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం

టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 14 , 2026 | 12:00 PM