Share News

Minister Adluri Laxman: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి అడ్లూరి క్లారిటీ..!

ABN , Publish Date - Jan 02 , 2026 | 06:40 PM

నరేగా పథకంపై, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు.పేదవారి పథకం గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ముఖం బీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు.

Minister Adluri Laxman: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి అడ్లూరి క్లారిటీ..!
Minister Adluri Laxman Kumar

హైదరాబాద్, జనవరి2 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలపై (Municipal Elections) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇవాళ(శుక్రవారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చిట్‌చాట్ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.


గత రెండు సంవత్సరాలుగా బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలి చూస్తున్నామని.. వారి పంతం నెగ్గించుకోవడానికి ఏమైనా చేస్తారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ముఖం బీఆర్ఎస్ నేతలకు లేదని ఎద్దేవా చేశారు. తమ తప్పు ఉంటే అసెంబ్లీలో నిరూపించాలని సవాల్ విసిరారు. మూసీ అంశంలో బీఆర్ఎస్ నేతలే రన్నింగ్ కామెంటరీ చేశారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభావం కోల్పోయిందని.. ఉనికి కాపాడుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.


నరేగా పథకంపై, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పేదవారి పథకం గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులకు వేడి నీటిని అందించడానికి సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఇందుకోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కనీసం గౌరవం ఇవ్వలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై రాకేశ్‌రెడ్డి ఫైర్

నూతన వాహన టాక్స్ విధానం ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

For More TG News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 07:03 PM