Share News

ఐపీఎల్ టికెట్ మాఫియా గుట్టురట్టు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

ABN , Publish Date - May 03 , 2026 | 12:32 PM

ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై హెచ్‌‌సీఏ, మల్కాజ్‌గిరి స్పెషల్ బ్రాంచ్, ఎస్‌ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసుల అదుపులో ఐపీఎల్ టికెట్ల విక్రయ ముఠా ఉంది.

ఐపీఎల్ టికెట్ మాఫియా గుట్టురట్టు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
IPL Tickets

హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై హెచ్‌‌సీఏ, మల్కాజ్‌గిరి స్పెషల్ బ్రాంచ్, ఎస్‌ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసుల అదుపులో ఐపీఎల్ టికెట్ల విక్రయ ముఠా ఉంది. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం జడ్జిలు, అధికారుల మంటూ హెచ్‌‌సీఏ‌కు కాల్స్ వెళ్లాయి. ఈ కాల్స్‌పై అనుమానం రావడంతో మల్కాజ్‌గిరి సీపీ సుమతికి హెచ్‌‌సీఏ‌ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి సమాచారం ఇచ్చారు.


ఈ ముఠా టార్గెట్‌గా మల్కాజ్‌గిరి ఎస్బీ, ఎస్ఓటీ , హెచ్‌‌సీఏ‌ జాయింట్ ఆపరేషన్ చేసింది. పీఎంఓ, గవర్నర్ ఆఫీస్ జడ్జిలు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్), MCA (ముంబై క్రికెట్ అసోసియేషన్) అని పేర్లు చెబుతూ నకిలీ లెటర్లు తయారు చేసి ఐపీఎల్ టికెట్ల కోసం ముఠా సభ్యులు ఫోన్లు చేస్తున్నారు. ఈ లెటర్లు అన్ని నకిలీవని హెచ్‌‌సీఏ‌ గుర్తించింది. ఈ ముఠాను పట్టుకోవడం కోసం టికెట్లను హెచ్‌‌సీఏ‌ ఎరగా వేసింది. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు అశోక్ ఉన్నట్లు సమాచారం. మిగతా ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రుణమాఫీ చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టింది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు

తండ్రిని విమర్శించడం కవితకు తగదు: దానం నాగేందర్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 04 , 2026 | 02:02 PM