Share News

వనపర్తిలో యువకుడిపై గుర్తుతెలియని దుండగుల దాడి

ABN , Publish Date - May 02 , 2026 | 12:15 PM

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. శివ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆయన కాళ్లు, చేతులను విరగొట్టి, తల పగలగొట్టి ఇంటి ముందు పడవేశారు.

వనపర్తిలో యువకుడిపై గుర్తుతెలియని దుండగుల దాడి
Wanaparthy Incident

వనపర్తి, మే2 (ఆంధ్రజ్యోతి): వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. శివ (27 ) అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆయన కాళ్లు, చేతులను విరగొట్టి, తల పగలగొట్టి ఇంటి ముందు పడవేశారు. ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు యువకుడిని బయటకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. అనంతరం గాయాలతో ఉన్న శివను ఇంటి ముందు వదిలి వెళ్లిపోయారు.


ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే గాయపడిన యువకుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడిపై దాడికి గల కారణాలపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రామంలో ఈ ఘటనతో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు త్వరగా నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కార్మికుల కన్నీటి చుక్కలే నాగరికత చరిత్రకు సిరా: సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి పొన్నం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 02 , 2026 | 12:23 PM