తండ్రిని విమర్శించడం కవితకు తగదు: దానం నాగేందర్
ABN , Publish Date - May 02 , 2026 | 12:37 PM
బీఆర్ఎస్ నేతలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు అత్యుత్సాహం ఎక్కువైందని విమర్శించారు.
హైదరాబాద్, మే2 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ నేతలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Narender) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు అత్యుత్సాహం ఎక్కువైందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారే ఇప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి ఆర్థికభారం ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు. రైతులకు ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తోందని.. గతంలో ఇవ్వకపోవడం కంటే ఇప్పుడు ఆలస్యంగానైనా ఇవ్వడం మంచిదే కదా అని చెప్పారు. ఎవరినీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వానికి లేదని చెప్పుకొచ్చారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లో దానం నాగేందర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్ ప్రజానాయకుడు.. ఆయన ప్రజల్లో ఉంటారని.. సందర్భాన్ని బట్టి బయటకు వస్తారని చెప్పుకొచ్చారు. కవిత కలలు కనాలి కానీ కబుర్లు చెప్పొద్దని ఎద్దేవా చేశారు. సొంత తండ్రిని విమర్శించడం ఆమెకు తగదని హితవు పలికారు. తల్లిదండ్రులను గౌరవించలేని వాళ్లు ఏం మనుషులని ప్రశ్నించారు. కవిత తన ఇంటి సమస్యను బయటకు తీసుకువస్తోందని అన్నారు. ఆమె రాజకీయంగా మాట్లాడాలి కానీ సొంత తండ్రిని విమర్శించడం ఏంటి? అని మండిపడ్డారు. కేసీఆర్‌ను కవిత డీ మోరల్ చేస్తూ.. పెద్దాయనను ఇబ్బంది పెట్టడం తగదని దానం నాగేందర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కార్మికుల కన్నీటి చుక్కలే నాగరికత చరిత్రకు సిరా: సీఎం రేవంత్‌రెడ్డి
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి పొన్నం
Read Latest Telangana News And AP News And International News And Telugu News