తెలంగాణ అరాచకత్వం అంచున ఉంది.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Sep 15 , 2026 | 09:04 AM
మాజీ మంత్రి కేటీఆర్ పీఆర్ మహేశ్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై నిన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కేటీఆర్ స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ పీఆర్ మహేశ్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలను పోలీసులు నిన్న (సోమవారం) సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారించిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే, పీఆర్ మహేశ్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఎక్స్(X) వేదికగా కేటీఆర్ స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ..
‘పోలీస్ స్టేషన్ లోపల తన పీఆర్ మహేశ్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై జరిగిన దాడి.. ప్రభుత్వ అణచివేతకు.. తలవంచని తెలంగాణలోని ఏ సామాన్య పౌరుడికైనా రేపు జరగవచ్చు. కొట్టడం లేదా హత్య చేయడమనేది ఎప్పుడూ నేరుగా ప్రాణం తీయడంతో మొదలుకాదు. కొన్నిసార్లు అది పూర్తి భద్రత ఉండాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే, యూనిఫామ్‌లో ఉన్న అధికారుల కళ్ల ముందే, అత్యంత పక్కాగా ప్లాన్ చేసిన దాడితో మొదలవుతుంది. ప్రభుత్వ వ్యవస్థలే ఈ గూండాగిరిని ప్రోత్సహిస్తూ, అండగా నిలుస్తున్న తీరు చూస్తుంటే.. త్వరలోనే మనం రోడ్లపై దాడులు, మూకదాడులు, లించింగ్‌లను చూసే ప్రమాదం ఉందని తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. తెలంగాణ ఇప్పుడు పూర్తి అరాచకత్వం అంచున నిలిచింది. వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ’ అని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ పోస్టు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్
అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు
శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్‌ల్లోకి దూసుకెళ్లి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News