కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:37 AM
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం ఈ రోజు (మంగళవారం) నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు రెండేళ్ల పాటు వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు కొనసాగనున్నాయి.
కీలక జంక్షన్ల వద్ద ఇప్పటికే రోడ్ మార్కింగ్‌లు, సైన్ బోర్డులను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. నాలుగు షిఫ్ట్‌లలో ట్రాఫిక్ సిబ్బంది మోహరించారు. 24 గంటల పాటు సీసీటీవీలు, డ్రోన్లతో రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ యాప్‌లలో కొత్త రూట్‌లకు అనుగుణంగా మార్పులు పూర్తి చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.
వార్తలు కూడా చదవండి...
22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోం: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News