Share News

కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలం: కవిత

ABN , Publish Date - May 23 , 2026 | 12:31 PM

సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ విఫలమైందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెంట్రింగ్ కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలం: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ విఫలమైందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెంట్రింగ్ కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈరోజు (శనివారం) ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ మహాధర్నాకు కవిత మద్దతు ప్రకటించారు. ఈ ధర్నాకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జనసేన రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్ మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.


సమస్యలు పరిష్కరించకపోతే ధర్నాచేస్తా..

రెండు రోజుల్లో సెంట్రింగ్ కార్మికుల నాయకులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించాలని కవిత డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే రెండు రోజుల తర్వాత తానే స్వయంగా ధర్నాలో కూర్చుంటానని స్పష్టం చేశారు. సెంట్రింగ్ కార్మికుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావని.. న్యాయమైనవేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా విద్య, వైద్యం అందిస్తామని కవిత స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్

కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 23 , 2026 | 12:34 PM