తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వండి.. ఈసీకి కవిత రిప్లయ్
ABN , Publish Date - Jul 12 , 2026 | 09:25 PM
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రిప్లయ్ ఇచ్చారు.
హైదరాబాద్, జులై 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రిప్లయ్ ఇచ్చారు. ఈనెల 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈసీకు ఆమె సమాధానం ఇచ్చారు. ఎన్నికల సంఘం ఆమోదించిన అనేక పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయని తెలిపారు. ఒక్క తెలంగాణలోనే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి పేర్లతో రెండు పార్టీలకు గుర్తింపునిచ్చారని ప్రస్తావించారు. వాటికి లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేనపై ఎందుకని ప్రశ్నించారు.
తమ పార్టీ రిజిస్ట్రేషన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన వెయ్యి అభ్యంతరాలను తమకు పంపాలని కవిత కోరారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సమాధానం ఇవ్వడానికి తమకు తగినంత సమయం ఇచ్చాకే... వ్యక్తిగత విచారణకు పిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆ వివరాల వెల్లడించిన తర్వాత తమ వాదనలను సమర్థవంతంగా వినిపించడానికి, అభ్యంతరాలకు సరైన సమాధానం ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
కేవలం సాధారణ భౌగోళిక వర్ణానాత్మక ఉనికి ఆధారంగా, ఊహాజనిత సంక్షిప్త రూపాల (Abbreviations) ఆధారంగా వచ్చిన అభ్యంతరాలన్నింటినీ తిరస్కరించాలని కవిత విజ్ఞప్తి చేశారు. చట్టప్రకారం నిష్పాక్షికమైన, హేతుబద్ధమైన పూర్తి కారణాలతో కూడిన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద ప్రతిపాదిత ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ గుర్తింపు కోసం తాము చేసుకున్న దరఖాస్తును పరిశీలించి, ఆమోదించాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News