కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి రానివ్వం: జగదీశ్‌రెడ్డి
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:14 PM
మాజీ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి రానివ్వమని స్పష్టం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డి ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి రానివ్వమని స్పష్టం చేశారు.
కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు తాకనివ్వబోమని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తమ పార్టీలో చేరడానికి అప్లికేషన్ పెట్టినా తీసుకోబోమని తేల్చిచెప్పారు. ఎన్నికల ముందే కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్‌లోకి వస్తామంటే తీసుకోలేదని అన్నారు. రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడుపోయినట్లేనని జగదీశ్‌రెడ్డి విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ విమానాశ్రయాల పనులు వేగవంతం చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి
22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి.. బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్
హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News