హైదరాబాద్‌లో హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 27 , 2026 | 08:34 AM
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో హైడ్రా అధికారులు శనివారం భారీ కూల్చివేతలు చేపట్టారు. హస్మత్‌పేట్ ప్రాంతంలోని సర్వే నంబర్-1 చత్రిగడ్డ వద్ద అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో హైడ్రా (HYDRAA) అధికారులు ఈరోజు (శనివారం) భారీ కూల్చివేతలు చేపట్టారు. హస్మత్‌పేట్ ప్రాంతంలోని సర్వే నంబర్-1 చత్రిగడ్డ వద్ద అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను గుర్తించిన హైడ్రా బృందం, భారీ యంత్రాల సహాయంతో వాటి తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది.
కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు, డీఆర్ఎఫ్, ఎస్ఓటీ సిబ్బందిని మోహరించారు. నాలుగు వైపులా భద్రతా వలయం ఏర్పాటు చేసి అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. కూల్చివేతల ప్రాంతానికి సాధారణ ప్రజలను, ఇతర వ్యక్తులను అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అన్యాక్రాంతమైన సుమారు 108 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటు విక్రయాలు కూడా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూకబ్జా వ్యవహారంలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు. సంబంధిత అంశాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాల పరిరక్షణలో భాగంగా అక్రమ ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు కొనసాగిస్తోందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుండగా, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు
మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News