Share News

మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:49 AM

జులై 2వ తేదీన జరిగే భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ స్థానికత విషయంలో మళ్లీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జులై 2వ తేదీన జరిగే భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పిలుపునిచ్చారు. తెలంగాణ స్థానికత విషయంలో మళ్లీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈరోజు (గురువారం) హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఎంఎస్‌మక్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.


తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలి..

ఒకటి నుంచి ఏడోతరగతి వరకు ఎక్కడ చదివినా తెలంగాణలో స్థానికులు అని కోర్టు చెబుతోందని కవిత అన్నారు. తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని.. మన వాళ్ల హక్కులు కాపాడటంలో వెనక్కు తగ్గేదేలేదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యమకారులకు భూములు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. అనేకమంది ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఉద్యమకారులు, నిరుద్యోగ సంఘాలతో కలిసి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోబోతున్నామని అన్నారు. ఈ భూములను పేదవాళ్లకు పంచబోతున్నామని వెల్లడించారు. ఉద్యమకారులకు భూమి ఇవ్వకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని పేర్కొన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో పోటీ చేస్తామని కవిత చెప్పుకొచ్చారు.


నీటి హక్కును కోల్పోతాం..

తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతిచ్చారని కవిత ఆరోపించారు. ఆర్డీఎస్ చుట్టూ కర్ణాటక చేపట్టే ప్రాజెక్టులతో మనం నీటి హక్కును కోల్పోతామని చెప్పుకొచ్చారు. మన హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి...కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆర్డీఎస్ మీద నిర్మించే ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకెళ్లారని ప్రశ్నించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వద్దకు అఖిలపక్షాన్ని సీఎం తీసుకెళ్లి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేయొద్దని కవిత కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం: ఎంపీ రఘునందన్ రావు

రేవంత్‌‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదు.. రెన్యువల్‌ సీఎం.. కేటీఆర్ సెటైర్లు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 01:03 PM