Share News

రైళ్లన్నీ కిటకిట.. వరుస సెలవులతో సొంతూరు బాటపట్టిన జనం

ABN , Publish Date - Sep 11 , 2026 | 08:46 AM

వరుసగా సెలవులు రావడం, పండుగ రోజులు కావడంతో రైళ్లలో రద్దీ తారస్థాయికి చేరింది.

 రైళ్లన్నీ కిటకిట.. వరుస సెలవులతో సొంతూరు బాటపట్టిన జనం
Hyderabad train rush

  • రిజర్వేషన్‌ దొరకట్లే..

  • వేలాడుతూనే ప్రయాణం

  • ప్రత్యేక రైళ్లున్నా వేళకు బయలుదేరని వైనం

హైదరాబాద్‌ సిటీ: వరుసగా సెలవులు రావడం, పండుగ రోజులు కావడంతో రైళ్లలో రద్దీ తారస్థాయికి చేరింది. వరుసగా రెండో శనివారం, ఆదివారంతో పాటు సోమవారం గణేశ్‌ చతుర్థి సెలవు కూడా కలిసి రావడంతో నగరవాసులు సొంతూరు బాటపట్టారు. సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా రెండ్రోజుల ముందే సెలవు పెట్టుకొని ఊళ్లకు బయల్దేరారు. ఫలితంగా కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో గురువారం ప్రయాణికుల రద్దీ పెరిగింది.


city1.jpgరెగ్యులర్‌ రైళ్లకు బెర్తుల రిజర్వేషన్‌ కోసమని నెల నుంచి ఎదు రుచూస్తున్న ప్రయాణికులకు ప్రస్తుతం వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు కూడా దొరకని పరిస్థితి. టికెట్లు బుక్‌ చేసుకునేందుకు వెళ్లిన ప్రయాణికులకు ‘రిగ్రెట్‌‘ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో సాధారణ టికెట్లు తీసుకొని జనరల్‌ బోగీల్లో ఎక్కేందుకు సిద్ధపడుతున్నారు. రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ కొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనే వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు.


city1.3.jpgగురువారం సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రె్‌సకు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రిజర్వుడు బోగీల్లోనూ సాధారణ టికెట్లతోప్రయాణికులు ఎక్కడంతో వారిని నియంత్రిచండం రైల్వే అధికారులకు తలనొప్పిగా మారింది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప నగరాల వైపు వెళ్తున్న రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

పాము విషానికి కొత్త విరుగుడు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 08:46 AM