Share News

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

ABN , Publish Date - Sep 11 , 2026 | 07:24 AM

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

అమరావతి, సెప్టెంబర్12: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు (శనివారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వివరించింది. నేటి నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దాంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా

హుండీలో భక్తుల కోరికల చిట్టా.. నా కోరిక నెరవేరిస్తే మందు మానేస్తా స్వామీ..!

For More Weather News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 07:45 AM