Share News

కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా

ABN , Publish Date - Sep 10 , 2026 | 07:37 PM

ఓ బాలిక తన కుక్కపిల్లతో చక్కగా ఆడుకుంటూ డ్యాన్స్ చేసిన వీడియా ఇప్పుడు తెగ వైరలవుతోంది. సోషల్ మీడియాలో మిలియన్ల లైకులను సొంతం చేసుకుంటోంది.

కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా
Girls Dance With Puppy

ఇంటర్నెట్ డెస్క్: ఓ బాలిక తన కుక్కపిల్లతో ఆడుకుంటూ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. సంతోషానికి డబ్బుతో సంబంధం లేదని కామెంట్లు చేస్తున్నారు.


వైరలవుతున్న వీడియోలో ఓ బాలిక రోడ్డు పక్కన ఉయ్యాలలో ఉన్న కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుకుంటోంది. కుక్కపిల్ల మూతిని తన చేతులతో బంధించి సరదాగా రెచ్చగొడుతుంది. తరువాత దాన్ని ఉయ్యాలలో వేసి ఊపుతుంది. ప్రేమగా ఆ శునకం పిల్లను దగ్గరకు తీసుకుని డ్యాన్స్ చేస్తుంది. అయితే ఈ వీడియో చూసిన యూజర్లు మంత్రముగ్ధులవుతున్నారు.

కల్మషం లేని రెండు జీవులను చూశామని నెటిజన్లు చెబుతున్నారు. సమాజంలోని మనుషుల కంటే ఆ పాప, ఇంకా కుక్కపిల్లే బెటర్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. నిజమైన ఐశ్వర్యం, సంతోషం ఇలా జీవించడంలోనే ఉన్నాయంటూ మరో వ్యక్తి వీడియోపై స్పందించారు. అయితే ఒక వ్యక్తి మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవితంలో కొన్ని క్షణాలు ఆనందంగా ఉన్నంత మాత్రాన నిత్యం సంతోషంగా ఉన్నట్టు కాదని చెప్పుకొచ్చారు. జీవన నాణ్యత పెరిగినప్పుడు, ఆర్థిక భద్రత దొరికినప్పుడు మాత్రమే జీవితాంతం సంతోషంగా ఉంటామని వివరించారు.


ఇవి కూడా చదవండి

ఇంకొన్ని ఉద్యోగాలు పోయాయ్.. ప్రముఖ వ్యాపారవేత్త పోస్టు వైరల్..

జారిపోతున్నా పట్టువదల్లేదు.. కూల్‌డ్రింక్ బాటిల్ చేజిక్కించుకున్నాడు.. వీడియో వైరల్

Updated Date - Sep 10 , 2026 | 08:11 PM