రాత్రి నిద్రపోయే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి.!
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:59 PM
నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనులు కూడా మనసుపై ప్రభావం చూపుతాయని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కోసం ఏ విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో వస్తువులను ఏ దిశలో, ఎక్కడ ఉంచుతున్నామనేది వాస్తు శాస్త్రంలో ముఖ్యమని చెబుతారు. అలాగే మన రోజువారీ అలవాట్లకు కూడా ప్రాధాన్యం ఉందని వాస్తు నమ్మకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనులు మనసుపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. అందుకే రాత్రిపూట కొన్ని విషయాలను పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తారు.
మంచం ముందు అద్దం ఉండటం
అద్దం ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ వస్తువే. అయితే వాస్తు ప్రకారం అద్దాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని నమ్ముతారు. అవి చుట్టుపక్కల ఉన్న శక్తిని ప్రతిబింబిస్తాయని భావిస్తారు. అందుకే పడుకునే సమయంలో మంచానికి నేరుగా ఎదురుగా అద్దం ఉండటం మంచిది కాదని వాస్తు చెబుతోంది. రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉండటంతో మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ, కొందరు తమ ప్రతిబింబాన్ని చూసి అనవసరంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి లేదా ఆందోళన పెరిగి నిద్రకు ఇబ్బంది కలగవచ్చని చెబుతారు.
తల దగ్గర నీళ్ల బాటిల్ పెట్టుకోవడం
చాలామందికి రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన లేదా తల దగ్గర నీళ్ల బాటిల్, గ్లాసు పెట్టుకునే అలవాటు ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం నీటిని చంచలత్వానికి సంబంధించిన మూలకంగా భావిస్తారు. అందువల్ల తల దగ్గర నీటిని పెట్టుకుని పడుకోవడం మంచిది కాదని కొందరు నమ్ముతారు. రాత్రిపూట నీటిని దగ్గరలో ఉంచుకోవాల్సి వస్తే.. మంచానికి కొంత దూరంగా, తల స్థాయికి కిందగా ఉండే సురక్షితమైన ప్రదేశంలో పెట్టుకోవాలని వాస్తు సూచనలు చెబుతున్నాయి.
Note: ఇందులోని సమాచారం వాస్తు నమ్మకాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆకలిగా ఉన్నప్పుడు కడుపులో పేగులు ఎందుకు అరుస్తాయో తెలుసా?
రాతపరీక్ష లేకుండానే పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి!