ఇంకొన్ని ఉద్యోగాలు పోయాయ్.. ప్రముఖ వ్యాపారవేత్త పోస్టు వైరల్..
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:45 PM
ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గొయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో చర్చకు దారి తీసింది. బుధవారం సాయంత్రం ఆయన తన ఎక్స్ ఖాతాలో మిషిన్ మనిషికి మెహందీ పెడుతున్న వీడియో షేర్ చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గొయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో చర్చకు దారి తీసింది. బుధవారం సాయంత్రం ఆయన తన ఎక్స్ ఖాతాలో మిషిన్ మనిషికి మెహందీ పెడుతున్న వీడియో షేర్ చేశారు. ‘మరికొన్ని జాబ్‌లు కూడా పోయాయ్’ అని రాసుకొచ్చారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా వ్యూస్.. 5 వేలకుపైగా లైక్స్ తెచ్చుకుంది. మిషిన్ మనిషికి మెహందీ పెడుతున్న ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
‘పారిశుద్ధ్య పనుల్లో ఇలాంటి ఇన్నోవేషన్ ఎందుకు తేవట్లేదు. చెత్త ఊడ్చడానికి, నదులు శుభ్రం చేయడానికి కొత్త కొత్త వస్తువులు ఎందుకు కనిపెట్టడం లేదు’.. ‘ఆ మిషిన్ చిన్న తప్పు చేసినా చెయ్యి పోతుంది’.. ‘మిషిన్లు ఎంత అందంగా మెహందీ పెట్టినా.. నేను మనిషితో మెహందీ వేయించుకోవడానికే ఇష్టపడతాను’..‘ఇదంతా ఓ చెత్త పని. మిషిన్లు నిజంగా అవసరమైన చోట ఉంటే బాగుంటుంది. చిన్న చిన్న పనులకు కాదు’.. ‘అది రియల్ వీడియో కాదు. ఏఐతో తయారు చేసింది. ఆ గ్లించ్‌లను చూసి కనిపెట్టవచ్చు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఏఐ ఫేక్ వీడియోలతో మోసాలు.. ప్రజలకు ప్రియాంక గాంధీ ఆఫీస్ హెచ్చరిక..
47 ఏళ్ల వయసులో సంచలనం సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్